నకిలీపై ఉక్కుపాదం..!


Thu,May 23, 2019 01:27 AM

-నకిలీ విత్తనాలు, ఎరువులపై రంగంలోకి టాస్క్‌ఫోర్స్
-దాడులకు సిద్ధమైన పోలీసు, వ్యవసాయ శాఖ
-జిల్లాలో ముందస్తుగా తనిఖీలు
-పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
-రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ): జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నా రు. వ్యాపారులు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి విత్తనాలను డంప్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో దందా సాగుతోంది. అధిక దిగుబడి వస్తుందని, గడ్డి మొలకెత్తకుండా ఈ మందు పనిచేస్తుందని కొందరు వ్యాపారులు ఆశజూపి అంటగడుతుండడంతో రైతులు నిలువునా మోసపోతున్నారు. ముఖ్యంగా పల్లె ప్రాంత రైతులను లక్ష్యంగా చేసుకుంటున్న వ్యాపారులు రైళ్ల ద్వారా నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇలా యేటా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఆశించిన ఫలితాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఆంధ్రా నుంచే ఎక్కువగా..
ఆంధ్రా ప్రాంతం నుంచి జిల్లాకు పెద్ద మొత్తం విత్తనాలు సరఫరా అవుతున్నాయి. ఒంగోలు, గుంటూరు, కర్నూల ప్రాంతాలే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూడా ఈ నకిలీలు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి. జిల్లాలో గతేడాది కోటి రూపాయలకు పైగా విత్తనాలు పట్టుకుని సీజ్ చేయడం గమనార్హం. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అమాయక రైతులకు ఈ పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. తిర్యాణి, కాసిపేట, వేమనపల్లి, తాండూరు, ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. మరోవైపు బ్రాండెడ్ ప్యాకెట్ ధర రూ.930 ఉండగా ఈ నకిలీ విత్తనాల ప్యాకెట్‌లను 600 రూపాయల నుంచి రూ.700లకే అమ్ముతుండడంతో రైతు కూడా వా టి వైపు మొగ్గుచూపుతున్నారు. బెల్లంపల్లి, తాం డూరు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు ఈ నకి లీ విత్తనాల దందా గుట్టుగా సాగిస్తున్నారు.

బీటీ-3 పేరుతో విక్రయాలు
ప్రస్తుతం మార్కెట్‌లో బీటీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. గతంలో ఉన్న విత్తనాలు లద్దె పురుగులను తట్టుకోకపోవడంతో బీటీ-2 విత్తనాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో రైతులు బీటీని వాడుతున్నారు. మరోవైపు మరింత తెగుళ్లను తట్టుకునేలా బీటీ-3 విత్తనాలను తయారు చేసిన కంపెనీలు మార్కెట్‌లోకి తేవడానికి రంగం సిద్ధం చేశాయి. వీటికి కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉం ది. అయితే బీటీ పత్తికి సంబంధించిన వివాదం నడుస్తుండడంతో కేంద్రం ఈ అనుమతులకు సంబంధించి పెండింగ్‌లో పెట్టింది. అయితే చాలాచోట్ల బీటీ-3 పేరుతో నకిలీలు దర్శనమిస్తున్నా యి. ఇవి కూడా పక్క రాష్ట్రాల నుంచి వెల్లువలా పడుతున్నాయి.

ఏటా రూ.కోట్లలో నష్టం..
జిల్లాలో ఈ ఏడాది 60వేల హెక్టార్ల వరకు పత్తి సాగవుతుందని అధికారులు అంచనా వేశా రు. యేటా ఇలా నకిలీల పేరుతో రైతులు రూ. కో ట్లలో నష్టపోతున్నారు. దాదాపు రూ. 300 కోట్ల మేరకు విత్తన వ్యాపారం జరుగుతుంది. ప్రభు త్వం దృష్టి పెట్టడంతో గతేడాది పెద్ద మొత్తంలో విత్తనాలు పట్టుబడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో వా నాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నా రు. ఈ ఏడాది కూడా నాసిరకం విత్తనాలు అమాయక రైతులకు అంటగట్టేందుకు పలువురు వ్యా పారులు సిద్ధమయ్యారు.

రంగంలోకి తనిఖీ బృందాలు
జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల మందుల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్, పోలీసు అధికారులతో కలిపి జిల్లాస్థాయిలో ఒక బృందాన్ని ఏ ర్పాటు చేశారు. అదే సమయంలో ఏడీఏ శ్రీనివా స్, పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయిలో బృందాలతో పాటు మండలాల్లో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు పూర్తి స్థాయిలో రంగంలో దిగనున్నా రు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే పీడీ యా క్ట్ ప్రయోగిస్తామని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కళాబృందాలు అవగాహన కల్పించనున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారి వివరాలు సేకరించి వారిపై గట్టి నిఘా ఉం చారు. టాస్క్‌ఫోర్స్ వీరిపై నిఘా ఉంచింది.

రైతులు ఈ జాగ్రత్తలు పాటించాలి
విత్తనాలు వ్యవసాయ నుంచి లైసెన్స్ పొందిన వారి దగ్గర నుంచే కొనాలని, రశీదు కచ్చితంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విడిగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకె ట్, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా నిర్ధారించుకోవాలి. గడువు దాటిన విత్తనాలు అసలే కొనవద్దని సూచిస్తున్నారు. బిల్లుపై విక్రయదారుడి పేరు, ప్రభుత్వాల పేరు, గ్రామం, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. నిల్వ ఉంచిన ఎరువులు, పురుగు మం దులు అసలే వాడొద్దు. ఎరువుల నాణ్యతపై అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులు సహకారంతో వాటిని పరీక్షలకు పంపాలని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...