ఆవిర్భావ వేడుకలు జయప్రదం చేయండి


Thu,May 23, 2019 01:25 AM

రెబ్బెన : జూన్ 2న సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా వేడుకలను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య సూచించారు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏరియా ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం కొండయ్య మాట్లాడుతూ గోలేటి సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏరియా లోని గోలేటిటౌన్‌షిప్, మదారంటౌన్‌షిప్, బెల్లంపల్లి పట్టణంలో ఉన్న మహిళలకు చిన్నారులకు ఆటల పోటీలు, ఉత్తమ కార్మికులకు సన్మానం, తెలంగాణ రన్, సాంస్కృతిక కార్యక్రమలు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా జానపద నృత్యాలుచ పాటలు, ధూంధాం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు ఆధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్) జే.కిరణ్, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్, బీపీఏఓసీపీటూ ప్రాజెక్టు అధికారి పురుషోత్తంరెడ్డి, ఏరియా ఇంజినీర్ చినబసివిరెడ్డి, డీజీఎం(సివిల్) సత్యనారాయణ, డీజీఎం(ఈఅండ్‌ఎం) శివరామిరెడ్డి, ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్, డీజీఎం(పర్చేజ్) రాజాజీ, డీజీఎం(ఐఈడీ) యోహన, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, వర్క్‌షాప్ ఇంజినీర్ గౌసోద్దీన్, వెల్ఫేర్ అధికారులు శ్రీకాంత్, క్రాంతికుమార్, వేణు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...