కార్మికులు క్రమశిక్షణతో మెలగాలి


Thu,May 23, 2019 01:25 AM

జైపూర్: ప్రతి కార్మికుడూ క్రమశిక్షణతో మెలగాలనీ, ఉద్యోగ బాధ్యతతో పాటు కుటుంబ బాధ్యతనూ మరువవద్దని శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ జీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారిగా డివిజన్‌లోని ఇందారంఖని 1 ఏ గనిని సందర్శించి ఆత్మీయపరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన కార్మికుడు ఎల్లప్పుడూ సమాజంలో గౌరవం పొందుతాడని తెలిపారు. కుటుంబంపై కూడా బాధ్యతగా వ్యవహరిస్తాడని తెలిపారు. సెల్ ఫోన్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడుకు వినియోగిస్తూ వ్యసనాల బారిన పడుతున్నారని చెప్పారు. వారిని సన్మార్గంలో పెట్టడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు. సంస్థకు ఉత్పత్తితో పా టు కార్మికుల రక్షణ కూడా ముఖ్యమన్నారు. ఎస్‌డీఎల్ యంత్రాల పని తీరులో సింగరేణి స్థాయిలో 2018-19 సంవత్సరంలో ప్రథమస్థానంలో ఉండడంపై కార్మికులను, అధికారులను అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా మనకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుని ఉత్పత్తి చేస్తే కంపెనీ లాభాల్లో పయనిస్తుందని తెలిపారు. ఇందారంఖని 1ఏ గనికి మంచి భవిష్యత్ ఉందని తెలిపారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో కలిసి జీఎం పని స్థలాలను సందర్శించారు. క్యాంటీన్‌ను సందర్శించి కార్మికులతో కలసి టిఫిన్ చేశారు. సీజీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ఇందారం గని 1ఏకు విచ్చేసిన జీఎంను అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐకే ఓసీ ప్రాజెక్టు అధికారి రాజేశ్వర్‌రెడ్డి, గని మేనేజర్ ఏన్ శ్రీధర్, ఓసీపీ గని మేనేజర్ సత్యనారాయణ, రక్షణ అధికారి రమేశ్, సంక్షేమాధికారి ప్రకాశ్‌రావు తదితరులున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...