ఈ-సెట్‌లో ప్రతిభ అభినందించిన కళాశాల సిబ్బంది


Thu,May 23, 2019 01:25 AM

బెల్లంపల్లి టౌన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో రెం డో సంవత్సరం ప్రవేశం కోసం నిర్వహించిన ఈ-సెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. కళాశాలలోని ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ విభాగంలో అలిక సన్నీ రాష్ట్ర వ్యా ప్తంగా మూడో ర్యాంకు, కోట రమాకాంత్ యాద వ్ ఐదు, బేరుగు రమ్య ఆరో ర్యాంకు సాధించి క ళాశాల ప్రతిభను రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. 11న జరిగిన ఈ-సెట్ 2019 ప్రవేశ పరీక్ష జరగగా తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ఛైర్మన్ పాపిరెడ్డి బుధవారం ఫలితాలను విడుదల చేశారు. సన్నీ 200 మార్కులకు 83, రమాకాంత్ 80, రమ్య 76 మార్కుతో రాష్ట్ర ర్యాంకులు సాధించా రు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మాదాక రాజ్‌కుమార్ 128 మార్కులతో ఏడో ర్యాంక్ పొం దాడు. ఈ-సెట్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థ్ధులను కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ హెడ్లు సాంబయ్య, వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ-సెట్ ఫలితాల్లో రాష్ట్ర ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులు వ్యవసాయ రంగ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం విశేషం.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...