భూ దందాపై ఉక్కుపాదం


Wed,May 22, 2019 03:12 AM

-మంచిర్యాల, బెల్లంపల్లి, నస్పూర్‌లలో భూ మాఫియాపై నజర్
-ఇష్టారాజ్యంగా ఆక్రమణలు.. యథేచ్ఛగా భూ దందాలు..
-కబ్జాలపై కన్నేసిన పోలీసు అధికారులు
-పీడీ యాక్టు నమోదు చేయనున్న పోలీసులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మం చిర్యాల, బెల్లంపల్లి, నస్పూరు ప్రాంతాల్లో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే ప్రభు త్వ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నా యి. భూ ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ వేస్తున్నప్పటికీ వాటిని తొలగించుకుని అక్రమణలకు పాల్పడుతున్నారు. చాలా మంది ప్రభుత్వ స్థలా లు ఆక్రమించుకుని వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. మాజీ మావోయిస్టు లు, పాత నేరస్తులు ముఠాగా ఏర్పడి ఈ భూ దం దాలకు పాల్పడుతున్నారు. సామాన్య జనం భూములు కొనాలంటే భయపడుతున్నారు. ఒక్కొక్కరికి రెండు, మూడు సార్లు భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో సామాన్యులు తాము కష్టపడి కూడబెట్టిన డబ్బు దళారుల పాలు చేయా ల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెల్లంపల్లి, నస్పూర్‌లలో దారుణం
- బెల్లంపల్లిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు సాగుతున్నాయి. కాంటా ఏరియా, కూరగాయల మార్కెట్, బజార్ ఏరియా, కన్నాల శివారు, బెల్లంపల్లి బస్తీ, సుభాష్ నగర్, బూడిదగడ్డ బస్తీ ఇతర ఏరియాల్లో కబ్జాలు సాగుతున్నాయి. కార్మిక కాలనీల్లో ఖాళీ స్థలం లేకుండా కబ్జా చేస్తున్నారు. కంపెనీ స్థలాలను ఆక్రమించుకుని కొంతమంది వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దెకు ఇస్తూ వేలు పొందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇండ్లు, దుకాణాలు కట్టుకున్న వారికి మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. నస్పూరులో కూడా భూ దందా జోరుగా సాగుతోంది. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి అడ్డదారుల్లో హక్కుదారులు అవుతున్నారు. కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకువచ్చి దర్జాగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా యథేచ్ఛగా సాగుతున్న అడ్డుకుంటన్న నాథుడే లేకుండాపోయాడు. ప్రభు త్వ భూములు కబ్జా చేసిన కొందరు అక్రమాలు ప్రజలకు విక్రయిస్తున్నారు. అది తెలియని అమాయకులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. దీంతో వాటిని కొన్న వారు ఇక్కట్ల పాలు అవుతున్నారు. చాలా చోట్ల కబ్జాదారులు ఆక్రమించి అమ్మేస్తున్నారు.

భూ కబ్జాదారులపై పీడీ యాక్టు
- జిల్లాలో భూకబ్జాల వల్ల సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారని పోలీసు యంత్రాం గం గుర్తించింది. ప్రభుత్వ భూములు ఆక్రమించి నా, వారికి సహకరించినా, ప్రజలను ఇబ్బందు లు పెట్టినా వారిపై కేసులు నమోదు చేసేందుకు ఖాకీలు సిద్ధమయ్యారు. అవసరమైతే పీడీ యాక్టు కూడా పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కొందరి పేర్లు కూడా పోలీసులు ప్రకటించారు. భూ దందాలు, ప్రభుత్వ, సింగరేణి భూ ములు ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కొద్ది రోజులుగా దృష్టి సారించారు. ప్రభుత్వ భూములు కా పాడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సమాచారం. వారికి సహకరించే అధికారులపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో అటు రెవెన్యూ అధికారులు భూములను కాపాడేందుకు రంగంలోకి దిగనున్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...