రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాలి


Mon,May 20, 2019 11:11 PM

శ్రీరాంపూర్‌:శ్రీరాంపూర్‌ ఏరియాలో జూన్‌ 2న ఆదివారం తెలంగాణా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణపై జీఎం సమీక్షా నిర్వహించారు. జూన్‌ 2న ఆదివారం శ్రీరాంపూర్‌ కాలనీ ప్రగతీ స్టేడియంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలను సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి లోటు పాట్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు, కార్మికులకు, కళాకారులకు, చిన్న పిల్లలకు, విద్యార్థినీ విద్యార్థులకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉత్తమ కార్మికులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రగతీ స్టేడియంలో తెలంగాణా సంబురాల కోసం అనేక రకాలైన తినుబండారాల స్టాళ్లు తెలంగాణా రుచుల వంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఫొటో స్టాళ్లు, ఎంవీటీసీ, ఓసీపీలకు, సూపర్‌బజార్‌లకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామని తెలిపారు. తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించే విధంగా జానపద నృత్యాలు, పాటల పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు పలు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల్లో కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏజెంట్లు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌, రఘుకుమార్‌, పీఓ చింతల శ్రీనివాస్‌, డీవైజీఎం గోవిందరాజు, ప్రసాద్‌రావు, రాజేశేఖర్‌, చిరంజీవులు, ఏఎస్‌ఓ గుప్తా, శ్రీనివాస్‌రావు, ఫైనాన్స్‌ మేనేజర్‌ రాజయ్య, డీవైసీఎంఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...