నకిలీ విత్తనాలు అమ్మడం నేరం


Mon,May 20, 2019 11:11 PM

చెన్నూర్‌ రూరల్‌: నకిలీ విత్తనాలను విక్రయించడం నేరమని హైదరాబాద్‌ కమిషనర్‌రేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక అధికారి (ఏడీఏ) వెంకటేశ్వర్‌ అ న్నారు. మండలం కిష్టంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో సమావేశమై మాట్లాడారు. నకిలీ విత్తనాలని అనుమానం వస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు నాటితే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా భూసారం దెబ్బతింటుందన్నారు. గ్రైసి ల్‌ విత్తనాలకు ఉపయోగించే మందులు కూడా ప్ర మాదకరమైనవన్నారు. సేంద్రియ సాగు వైపు అ డుగులు వేయాలని తెలిపారు. చెన్నూర్‌ పట్టణంలోని చేతన్‌ ట్రైడర్స్‌, ఫతేచంద్‌ రాంనారాయణ లహోటి, పలు పెర్టిలైజర్‌ దుకానాలకు తనిఖీ చేశారు. వెంట టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ రత్నాకర్‌, చెన్నూర్‌ వ్యవసాయ ఏడీఏ జే బాపు ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...