మహారాష్ట్రకు అటవీ అధికారులు


Mon,May 20, 2019 11:11 PM

-పులిచర్మం కేసులో విచారణకు తరలిన సిబ్బంది
వేమనపల్లి: గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ చిరుతపులి చర్మం కేసు విషయంలో విచారణ చేప ట్టేందుకు కుష్నపల్లి రేంజ్‌ అటవీ అధికారులు మహారాష్ట్రకు వెళ్లినట్లు కుష్నపల్లి అటవీ క్షేత్రాధికా రి గోవింద్‌ చంద్‌ సర్దార్‌ సోమవారం తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఓలు పాటేకర్‌, బాదర్‌, ఎఫ్‌బీఓలు అనీ ల్‌, అశోక్‌, బేస్‌ క్యాంపు సిబ్బంది మహారాష్ట్రలోని బోండ్రా, మూజువాణిపేట, పైడిగూడెం గ్రామా ల్లో విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం తనిఖీలు చేపట్టారు. అక్కడి ప్రజలను విచారించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని సిబ్బది తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...