గురుకులానికి పొనకల్‌ విద్యార్థులు


Mon,May 20, 2019 11:11 PM

జన్నారం: మండల కేంద్రంలోని పొనకల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్‌ మీడియానికి చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికై సత్తా చాటినట్లు ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 12 మంది విద్యార్థులు గురుకుల పరీక్షలకు హాజరవగా 9 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన వారి లో ఎండీ రాహిల్‌బాబ, మధిరె వర్షిణి, జాడి లావణ్య, జే శ్రీనిధి, ఉప్పు అభిరాం, కే శ్రీ కాంత్‌, జాదవ్‌ కృష్ణవేణి, సంజన, బోరె వైష్ణవి ఉన్నట్లు తెలిపారు. గతేడాది కూడా ఇదే పాఠశాలకు చెందిన ఆరు గురు విద్యార్థులు గురుకులానికి ఎంపికైట్లు తెలిపారు. విద్యార్థులను ఎంఈవో నడిమెట్ల విజయ్‌కుమార్‌, తోటి విద్యార్థులు అభినందించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...