డ్రైవర్లు బాధ్యతాయుతంగా మెలగాలి


Mon,May 20, 2019 11:11 PM

మంచిర్యాల స్పోర్ట్స్‌: విద్యా సంస్థల బస్సుల డ్రైవర్లు బాధ్యతాయుతంగా నడపాలని జిల్లా రవాణాశాఖధికారి కిష్టయ్య సూచించారు. జిల్లా కేం ద్రంలోని వేంపల్లి రవాణాశాఖ కార్యాలయంలో జిల్లాలోని విద్యా సంస్థల బస్సుల డ్రైవర్లు, క్లీనర్లకు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. కిష్టయ్య మాట్లాడుతూ జిల్లాలో 441 విద్యా సంస్థల బస్సులున్నాయనీ, గతేడాది నుం చి ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం జరగకుండా డ్రై వర్లు జాగ్రత్తలు తీసుకున్నారని అభినందించారు. బస్సు కండీషన్‌ను ప్రతి రోజు చెక్‌ చేసుకోవాలని తెలిపారు. యజమానులు హెవీ వెహికిల్స్‌ నడిపించడంలో ఐదేండ్ల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలని సూచించారు.
డీఎంహెచ్‌వో భీష్మ మాట్లాడుతూ వాహనాలు నడిపేప్పుడు యాక్సిడెంట్స్‌ అయితే ఎలాంటి గా యాలవుతాయి, ప్రథమ చికిత్సపై వివరించారు. సీనియర్‌ ఎంవీఐ వివేకానందరెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడద్ద నీ, గుట్కాలు, పాన్లు తినద్దనీ, పిల్లలను ఎక్కించేప్పుడు, దింపేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. పరిమితికి మించి వేగంగా నడపద్దనీ, ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని తెలిపారు. హెవీ వెహికిల్స్‌ నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం రూ. 5 లక్షల ప్ర మాద బీమా సౌకర్యం కల్పింస్తుందన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని లేదంటే ప్ర మాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. బస్సులకు రిపేర్‌ ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి చేయించాలన్నారు. చిన్నదే అని వదిలేస్తే పెద్ద ప్రమాదానికి దారితీయచ్చన్నారు. బస్సులో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలని ఫైర్‌మన్‌ భిమయ్య వివరించారు. అనంతరం శిక్షణ కు హాజరైన డ్రైవర్లకు రవాణా శాఖ నుంచి ధ్రువీ కరణ పత్రాలను డీటీవో కిష్టయ్య అందజేశారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ శ్రీనివాస్‌, ప్రత్యూష, విద్యా సంస్థల బస్సుల డ్రైవర్స్‌, క్లీనర్స్‌, రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...