పోయివస్తం జల్లిదేవర..


Mon,May 20, 2019 03:44 AM

-ఘనంగా ముగిసిన ఆదివాసీల ఉత్సవాలు
-చివరి రోజు ప్రత్యేక పూజలు
కాసిపేట: మండలంలోని గట్రావ్‌పల్లిలో జల్లిదేవర ఉత్సవాలను ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ప్రతి వేసవి కాలంలో జల్లిదేవర(పెర్సపేన్) ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహిస్తుండగా ఈ ఏడాది నిర్వహించిన ఉత్సవాల్లో నూతన కోడళ్ల పరిచయ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 16వ తేది నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శనివారం సల్పాలవాగు సమీపంలోని ఆదివాసీల పెద్ద దేవర వద్దకు ఆదివాసీలు అంతా కాలినడకన తరలివెళ్లి పుణ్య స్నా నాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి గ్రామానికి తరలివచ్చారు. ఆదివారం చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గట్రావ్‌పల్లితో పాటు ఇతర మండల, జిల్లాల నుంచి ఆత్రం వంశీయులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీల సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆత్రం వంశీయుల పూజారులు ఆ త్రం మైసు, ఆత్రం బారిక్‌రావు, ఆత్రం వంశీ దేవరి, ఆత్రం జలపతి చేతుల మీదుగా ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్రం వంశీయుల పెద్ద మనుషులు ఆత్రం అచ్యుత్‌రావు, ఆత్రం నాగుబాయి, ఆత్రం కౌసల్య భాయి, ఆత్రం గంగుభాయి, ఆత్రం దేవుభాయి, జుగునాక దశవంత్, మడావి గంగు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...