రైతుబంధు రెడీ


Sun,May 19, 2019 12:54 AM

-పెట్టుబడి సాయం అందించడానికి సర్కారు సిద్ధం
-ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అందించాలని ఆదేశాలు
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతుబంధు సాయం అందించడానికి సర్కారు సిద్ధమైం ది. మరో పక్షం రోజుల్లో వేసవి ముగియనుండటంతో చెక్కులు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ డబ్బులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతాయని భావిస్తున్నది. 2017-18 ఖరీఫ్‌లో 1,25,346 మంది రైతులకు రూ.133.65 కోట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో 1,13,418 మంది రైతులకు రూ.116. 35 కోట్లు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలు రాకపోవడం, వివాదాలు ఉండడం, కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, వివిధ కారణాలతో రూ.17.3 కోట్లు పంపిణీ చేయలేదు. అనంతరం రబీలో కూడా దాదాపు అంతే మొత్తాన్ని విడుదల చేసింది.

రబీ సీజన్ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కోడ్ ముగిసిన వెంటనే పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయ, రెవెన్యూ, ట్రెజరీ అధికారులు సన్నద్ధం అయ్యారు. గతంలో ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి సాయం అందచేయగా, ఈ సారి రూ.5వేలకు పెంచిన విష యం తెలిసిందే. గత ఖరీఫ్, రబీలో రాని వారికి కూడా పెట్టుబడి సాయం అందించనున్నారు.

సాయం కోసం రైతుల ఎదురుచూపు
ఈసారి పెట్టుబడి సాయం ఎకరానికి రూ.1000 పెంచారు. దీంతో బడ్జెట్ పెరగనుంది. ఖరీఫ్, రబీ లో రూ.133 కోట్లు కేటాయించారు. ఇప్పుడు రూ.150 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. రైతులకు నూతనంగా పాసు పుస్తకాలు అందచేయడం వల్ల 2019-20 సంవత్సరం ఖరీఫ్‌కు ఎక్కువ మంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నూతనంగా పాసు పుస్తకాలు పొందిన వారు, తప్పులు దిద్దినవి, ఇతర కారణాలతో పెట్టుబడి సాయం పొందని ఖాతాలు అన్నింటి వివరాలను ప్రస్తుతం వ్యవసా య విస్తరణాధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.

కాగా, ఇప్పటికే రైతులు వేసవి దుక్కు లు దున్నుకుని సిద్ధంగా ఉన్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు ఎదురుచూస్తున్నా రు. ఈ నెలఖారులోగా రైతులకు రైతుబంధు సా యం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని కోడ్ ముగియగానే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...