ధరణిపై సత్వరమే స్పందించండి


Sun,May 19, 2019 12:53 AM

మంచిర్యాల రూరల్: ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌సెట్‌లో నమోదైన సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జేసీ సురేందర్‌రావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలసి జిల్లాలోని మండలాల తహసీల్దారులు, రెవెన్యూ అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. రైతుల సాగు భూములు, ప్రభు త్వ, ఇతర రకాలైన భూములకు సరిహద్దులను నిర్ణయించి సమస్యల పరిష్కారం దిశగా అన్ని చ ర్యలు చేపట్టాలన్నారు. వెబ్‌సెట్‌లో నమోదైన స మస్యలపై సత్వరం స్పందించకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలోని భూకమతాల రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, సర్వేయర్లు, ఆర్‌ఐలు సహకరించాలని తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్యామలాదేవి, రాజస్వ మండలాధికారి సురేశ్, ఎల్లంపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వర్ రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సురేశ్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...