సేంద్రియ సాగుపై దృష్టి పెట్టండి


Sun,May 19, 2019 12:53 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలనీ, తద్వారా వ్యవసాయా నికి పూర్వవైభవం వస్తుందని జిల్లా కలె క్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. బెల్లంపల్లి లోని టీసీఓఏ క్లబ్‌లో సేంద్రియ సాగుపద్దతులపై రైతుల కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారుఏర్పాటు చేశా రు. దీనికి హాజరైన ఆమె మాట్లాడారు. సహజ సిద్ధమైన ఎరువులతో భవిష్యత్‌లో మంచి దిగుబడి వస్తుంద ని పేర్కొన్నారు. రసాయన ఎరువులతో పంటలు విషతుల్యమై భూమి భూసారం పూర్తిగా క్షిణించి పోతుందని పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు రావాలని సూచించారు. తాత్కాలిక లాభా ల కోసం రైతులు రసాయన ఎరువులను ఆశ్రయిస్తే ప్రకృతి విధ్వంసమైపోతుందని పేర్కొన్నారు. ప్రభు త్వం రైతుల సంక్షేమ కోసం భవిష్యత్ తరాల కోసం భూమిని కాపాడుకోవడంకోసం సేంద్రియ సాగు అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. దేశానికి వెన్నముకైన వ్యవసాయ రంగాన్ని పరిరక్షించేందుకు సేంద్రియ సాగుకు తోడ్పాటు అందిస్తున్నదన్నారు. రైతులకు సేందియ వ్యవసాయభివృద్ధి కోసం అన్ని విధాలుగా చేయూతనందిస్తామన్నారు. సేంద్రి య సాగుపై రైతుల్లో తగినంత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. బెల్లంపల్లి డివిజనల్‌లో ఈ సంవత్సరం 1500 ఎకరాల సేంద్రియసాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సేంద్రియ సాగులో జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పీఎస్ రాహు ల్‌రాజ్, డీఏఓ వినోద్ కుమార్, ఏడీఏ సురేఖ, తహ సీల్దార్ దుర్శెట్టి శ్రీనివాస్, డీహెచ్‌ఎస్‌డీ రాజ్‌కుమా ర్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...