దుబ్బగూడెంలో సర్వే ప్రారంభం


Sun,May 19, 2019 12:53 AM

కాసిపేట : మందమర్రి కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్‌లో నష్టపోతున్న కాసిపేట మండలం దుబ్బగూడెం నిర్వాసిత గ్రామానికి సంబంధించి ఎంజాయ్‌మెంట్ సర్వేను అధికారులు శనివారం ప్రారంభించారు. అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి వేర్వేరుగా సర్వే చేశారు. మొదట ఎంజాయిమెంట్ సర్వే, సోషల్ ఎకనామికల్ సర్వే కోసం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయగా, కేవలం ఎంజాయిమెంట్ సర్వే మాత్రమే చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇంటి స్థలం, ఇంటి ఆవరణలో స్థలాలు, చెట్లు, ఇతర సముదాయాలపై సర్వే చేయనున్నట్లు వివరించారు. పరిహారం విషయంలో భూమి చూపకుండా స్పష్టమైన హామీ ఇవ్వకుండా అవగాహన కల్పించకుండా సర్వే చేయడంపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. కేవలం ఇంటి స్థలాలు, ఆవరణ స్థలాలు మాత్రమే సర్వే చేస్తామని అధికారులు గ్రామస్తులకు వివరించారు. భూమి విషయం, పరిహారం విషయంలో గ్రామస్తుల నిర్ణయం మేరకు ఫైనల్ చేస్తామని వెల్లడించారు. అధికారులకు సర్వేపై స్పష్టత లేకపోవడంతో గ్రామస్తులకు ఏమీ చెప్పలేకపోయారు.

సర్వే విషయంలో ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు, వాటి వివరాలు, చేపట్టే సర్వే వివరాలను గ్రామస్తులకు వివరించి అవగాహన కల్పించాల్సి ఉండగా, గ్రామస్తుల ప్రశ్నలకు ఏ ఒక్క సమాధానం చెప్పకపోవడం, కనీసం గ్రామస్తులకు సరైన అవగాహన కల్పించకపోవడంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సింగరేణి ఓసీ విషయంలో ప్రజలకు అందించే హామీలపై స్పష్టత ఇవ్వడం లేదని గ్రామస్తులు మండి పడుతున్నారు. సర్వే విషయంలో ఎంజాయిమెంట్ సర్వే, సోషల్ ఎకనామికల్ సర్వే అని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాని సర్వే కోసం వచ్చిన అధికారులు మాత్రం ఏ విధంగా సర్వే చేయాలని, శిక్షణ ఇవ్వకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో చివరకు సింగరేణి అధికారులు సూచించిన సర్వే చేశారే తప్ప ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సర్వే చేపట్టలేదనే విమర్శలున్నాయి.

కల్యాణిఖని సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తీర్ణలో భాగంగా దుబ్బగూడెంలో సర్వే నంబర్ 144,145లో 37.13 ఎకరాలు సింగరేణి ప్రాజెక్ట్‌కు అవసరం ఉంది. దుబ్బగూడెం ఓపెన్ కాస్ట్‌లో ముంపునకు గురవుతుండగా, సింగరేణి ప్రాజెక్ట్‌కు గ్రామానికి సంబంధించి భూములను అప్పగించడంలో భాగంగా పరిహారం విషయంలో అంచనా కోసం గ్రామంలో సర్వే చేస్తుండగా గ్రామస్తులు సానుకూలంగా ఉన్నప్పటీకీ అధికారులు స్పష్టత ఇవ్వడంలో విఫలం అవుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...