బడిబాటను విజయవంతం చేయాలి


Sun,May 19, 2019 12:53 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : జూన్ 4వ తేదీ నుంచి 12వరకు నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని డీఈఓ ఎంఏ రషీద్ పేర్కొన్నారు. శనివా రం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు. ఎం ఈఓలు, అన్ని యజమాన్యాల పాఠశాలల హెచ్‌ఎం లు, ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్లు, ఉపాద్యాయులు బడిబాట కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో భాగంగా బడీడు పిల్లలను, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. జూన్ 1న అన్ని పాఠశాలలు ప్రారంభమవుతాయన్నారు. ఎంఈఓలు,ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోగల ప్రజాప్రతినిధులను, వివిధ శాఖల అధికారులను,ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వామ్యం చేసి బడిబాటను విజయవంతం చేయాలన్నారు. 7నుంచి 13వ తరగతి వరకు గల విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామో తెలియజేస్తూ బ్యానర్లు, కరపత్రాల ద్వారా తెలపాలని సూచించా రు.

బడిబాటలో భాగంగా ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని తెలిపారు. ఆర్‌టీఈ/సీఆర్‌సీ పిల్లల హక్కులు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18004253525 ప్రతి పాఠశాలలో నోటీస్ బోర్డుపై ఉంచాలని డీఈఓ సూచించారు.

బడిబాట కార్యక్రమాలు ఇవీ..
-జూన్ 4న బడిబాట ప్రారంభం అవుతుంది. పాఠశాలను ఆకర్షనీయంగా తయారు చేయనున్నా రు. ర్యాలీలు తీసి, కరపత్రాలను పంపిణీ చేయనున్నారు.
పాఠశాలలో విద్యా కమిటీ, ఉపాధ్యాయులతో సమావేశమవుతారు. పాఠశాలను అభివృద్ధి చేసుకునేందుకు, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎలాం టి చర్యలు తీసుకోవాలనే దానిపై తీర్మానం చేస్తారు.
-7న బాలిక విద్యపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పి స్తూ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తారు. కేజీబీవీలలో చేరేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు సౌకర్యాలపై అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లో బాలికల విద్యకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు(మార్షల్ ఆర్ట్స్, జీవన నైపుణ్యాలు, ప్రత్యేక అవసరాలుగల బాలికలకు ైస్టెఫండ్ అందుతున్నవి వివరిస్తారు.
-10న సాముహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చదువు విశిష్టతను తెలియజేస్తారు. నూతనంగా బడిలో చేరిన పిల్లల తల్లిదండ్రులు కార్యక్రమం హాజరవుతారు.
-11న స్వచ్ఛ పాఠశాల /హరితహారం కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలలో పచ్చదనం పెంపొందించేలా
మొక్కలను నాటిస్తారు. నాటిన మొక్కలను సం రక్షణ బాధ్యతలను కేటాయిస్తారు. పాఠశాలల ప్రాం గణాలను ఆకర్షనీయంగా సిద్ధం చేయనున్నారు.
-12న బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ను భాగస్వామ్యం చేస్తూ డోర్ టూ డోర్ సర్వే నిర్వహిస్తారు. పనికోసం వచ్చిన వారి పిల్లలను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేర్పించనున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...