శంకర్‌కు న్యాయం చేస్తాం..


Sat,May 18, 2019 12:42 AM


-నమస్తే కథనంతో కదిలిన అధికారులు
వేమనపల్లి : వేమనపల్లి మండలకేంద్రానికి పతాగిరి శంకర్ స మస్యకు ధర్మగంటతో పరిష్కా ర మార్గం దొరికింది. గ్రామ శి వారులోని సర్వే నెంబరు 13లో 2.14 ఎకరాల భూ మిని తన పేరు మీద విరాసత్ చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా స్పందించకపోవడం తో చివరికి నమస్తేను ఆశ్రయించాడు. ఈమేరకు గురువారం 24 ఏండ్ల భూ పోరా టం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై రెవెన్యూ అధికారులు శుక్రవారం స్పందించా రు. చెన్నూరులో తాత్కాలికం గా నిర్వహిస్తున్న వేమనపల్లి తాసిల్దార్ కార్యాలయానికి శం కర్‌ను తాసిల్దార్ నరేందర్ పిలిపించి రికార్డులను పరిశీలించారు. వేమనపల్లి శివారులోని సర్వే నెంబరు 13లో మోకాపై శంకర్ ఉన్నట్లు గుర్తించారు. క లెక్టర్, సబ్ కలెక్టర్‌కు నివేదిక లు అందజేస్తున్నట్లు తెలిపా రు. ఆ కాపీని శంకర్‌కు తహసీల్దార్ అందచేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నమస్తే తెలంగాణకు
రుణపడి ఉంటా
ఏండ్ల నుంచి ఉన్న నా భూమి సమస్య పరిష్కారం కావడం చాలా సంతోషంగా ఉంది. దీని గురించి ఎన్నోసార్లు రెవె న్యూ ఆఫీసు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలే. నమస్తే తెలంగాణ పేపర్‌లో మొన్న నా గురించి వార్త వచ్చింది. వెంటనే నన్ను తాసిల్దార్ ఆఫీస్‌కు పిలిపించి విరాసత్ చేస్తామని తాసిల్దార్ చెప్పారు. నమస్తే తెలంగాణ పేపర్‌కు ఎల్లప్పుడు రుణపడి ఉంటా.
- పతాగిరి శంకర్

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...