లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించాలి


Sat,May 18, 2019 12:41 AM

మందమర్రి : ఉన్నత చదువుల్లో రాణించాలి అనే లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించాలనీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాలలో 10 జీపీఏ సాధించిన పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థిని మేడి వాసవిని శుక్రవారం తన కార్యాలయంలో కలెక్టర్ పుష్ఫగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుల కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందనీ, స్వగ్రామానికి కుటుంబానికి దూరమవ్వాల్సి వస్తుందన్నారు. అలాంటి సమయంలో ఎలాంటి అధైర్యానికి లోను కాకుండా చదువు పై శ్రధ్ద పెట్టాలన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి కీర్తిని తీసుకురావాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాద్యాయుడు అయూబ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 47 శ్రీచైతన్య బ్రాంచీలో 182 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని తెలిపారు. పక్కా అకాడమిక్ ప్లాన్, అనుభవం, సమర్ధత కలిగిన ఉపాధ్యాయుల కృషితోనే 100 శాతం ఫలితాలను సాధించగలిగామని ఆయన అన్నారు. పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణ్‌రావు వాసవిని అభినందించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...