ట్రాఫిక్ పోలీసుల సేవలు అభినందనీయం


Sat,May 18, 2019 12:41 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: మండుటెండలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పాటు పడుతున్న ట్రాఫిక్ పోలీసుల సేవలు అభినందనీయమని డీసీపీ రక్షిత మూర్తి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన సిరాజొద్దీన్, నిర్మల్‌రాయ్, విజయ్, శేఖర్‌శెట్టి, ముకేశ్‌గౌడ్, బోరిగాం శ్రీనివాస్ అనే దాతలు అందజేసిన కూల్ జాకెట్లు, వాటర్ బాటిళ్లను ట్రాఫిక్ పోలీసులకు డీసీపీ శుక్రవారం అందజేశారు. ఎండా కాలంలో మండే ఎండలలో ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారనీ, మితిమీరుతున్న ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ ప్రజల జీవనానికి ఆటంకం లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారికి ఆరోగ్యపరంగా ఉపయోగపడే ఈ వస్తువులను అందించడం అభినందనీమన్నారు. దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రమేశ్‌బాబు, ఏఎస్‌ఐలు అంజన్న, శ్రీనివాస్, రెహ్మాన్, తదితరులున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...