ఫైనాన్స్‌పై కేసు


Sat,May 18, 2019 12:40 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : పట్టణంలోని కాల్‌టెక్స్‌లో ఉన్న ఫైనాన్స్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ అందెరాములు కథనం ప్రకారం... కాల్‌టెక్స్‌లో పోతరాజుల మంగమూర్తి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఫైనాన్స్ సంస్థలో శుక్రవారం ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేసినట్లు తేలిందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. అధిక వడ్డీతో రుణాలు, నకిలీ ప్రామిసరీ నోట్స్ లభించాయన్నారు. దీంతో నిర్వహుకుడితోపాటు మరో ఆరుగురు భాగస్వాములపై కేసు నమోదు చేశామన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...