అసలు భూమే లేదంటన్రు


Fri,May 17, 2019 03:33 AM

కౌటాల : సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన శాంతబాయి గాడె(భర్త గజానన్‌ గాడే) కౌటాల మండలం గుడ్లబోరి గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 34లో మహ్మద్‌ సయిదుద్దీన్‌ పేరిట ఉన్న 50 ఎకరాల భూమిని 1971లో కొనుగోలు చేసింది. అట్టి భూమిని 23 ఆగస్టు, 1971లో మంచిర్యాలలోని సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయం రిజిస్ర్టేషన్‌ చేయించుకుంది. ఈ క్రమంలో శాంతబాయి గాడే 1994లో మృతి చెందింది. తదనంతరం ఆమె వారసులైనా మధుకర్‌ గాడే, శరత్‌ గాడే, సుభాశ్‌గాడే, రాజేశ్‌ గాడే, సురేశ్‌గాడే, విజయ్‌గాడే పేరిట 50 ఎకరాల భూమి విరాసత్‌ చేశారు. 1996లో మధుకర్‌ గాడేకు సర్వే నంబర్‌ 34/1/అ..లో 8.34 ఎకరాలు, శరత్‌ గాడేకు సర్వే నంబర్‌ 34/1/ఆ..లో 8.34 ఎకరాలు, రాజేశ్‌ గాడే సర్వే నంబర్‌ 34/1/ఇ..లో 8.33 ఎకరాలు, సుభాశ్‌గాడేకు సర్వే నంబర్‌ 34/1/ఈ..లో 8.33 ఎకరాలు, సురేశ్‌గాడేకు సర్వే నంబర్‌ 34/1/ఉ..లో 8.33 ఎకరాలు, విజయ్‌ గాడేకు సర్వే నంబర్‌ 34/1/ఊ..లో 8.33 ఎకరాల భూమి విరాసత్‌ అయ్యింది. పట్టదారులలో మధుకర్‌ గాడే, సుభాశ్‌గాడే, సురేశ్‌గాడే, శరత్‌గాడే, విజయ్‌ గాడే మృతి చెందారు. తమ పేరిట పట్టా పాసు పుస్తకం మార్చాలంటూ వీరి భార్యలు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.

చివరకు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశానుసారం 19-07-2017న హై కోర్టు సమక్షంలో మృతి చెందిన వారి వారసులు, భార్యల పేరిట (మధుకర్‌ గాడే కొడుకు సంజయ్‌ గాడే, సుభాశ్‌ గాడే భార్య లతిక గాడే, సురేశ్‌ గాడే భార్య సుశీల గాడే, విజయ్‌ గాడే భార్య గీత గాడే) తాసిల్‌ అధికారులు పట్టా పాసుపుస్తకాలు, టైటిల్‌ పుస్తకాలు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మోఖామీద భూమి ఎక్కడుందో మాత్రం చూపించలేదు. దీంతో ఏడాదిన్నర క్రితం తెలంగాణ సర్కారు చేపట్టిన భూ ప్రక్షాళన సర్వే సందర్భంగా అధికారులను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు కొత్త పట్టాపాసు పుస్తకాలు ఇచ్చి.. మోఖా మీద భూమి చూపించాలని దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోలేదు. బతుకుదెరువుకోసం ఒక్కొక్కరం ఒక్కోచోట ఉంటున్నామనీ, తాసిల్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా స్పందించడం లేదనీ, అసలు తమ సర్వే నంబరు రిజష్టర్‌లలోనే లేదంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...