పారిశుధ్యం పాటించాలి


Fri,May 17, 2019 02:13 AM

-ప్లాస్టిక్‌ కవర్లు వాడద్దు
-మున్సిపల్‌ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌
బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రజలు పారిశుధ్యం పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌ సూచించా రు. పట్టణంలోని బజార్‌ ఏరియాలోని పలు వార్డుల్లో నిర్వహించిన పారిశుధ్య పనులను గురువారం పరిశీలించారు. కూరగాయల మార్కెట్‌, దుకాణాల్లో వ్యాపారులు ప్లాస్టిక్‌ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు విక్రయించద్దన్నారు. చేపల మార్కెట్‌లో పర్యటించి ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను వ్యాపారులకు అవగాహన కల్పించారు. మాంసం దుకాణాల్లో పర్యటించి ఆరోగ్య కరమైన, పశువైధ్యులు ధ్రువీకరించిన జీవాల మాంసాన్ని మాత్రమే అ మ్మాలని సూచించారు. పరిశుభ్రతను పా టించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘి స్తే రూ. 5వేల జరిమానాతో పాటు కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికె న్‌, మటన్‌, చేపల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లుపై వేయద్దని తెలిపారు. పారిశుధ్యం. వాతావరణ కాలుష్య నివారణకు సహకరించాలని కోరారు. కౌన్సిలర్‌ రాజూలాల్‌యాదవ్‌, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...