గణనను పకడ్బందీగా చేయాలి


Fri,May 17, 2019 02:13 AM

-నస్పూర్‌ తహసీల్దార్‌ మోబిన్‌ అహ్మద్‌

మంచిర్యాల రూరల్‌ : ప్రామాణిక సంవత్సరం 2017-2018ని పరిగణలోనికి తీసుకొని జలవనరుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి నస్పూర్‌ తహసీల్దార్‌ సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్‌ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల, నస్పూర్‌, హాజీపూర్‌ మండలాలకు చెందిన రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్‌, నీటిపారుదల, విద్యుత్‌ అధికారుల సిబ్బందికి 6వ చిన్న తరహా నీటి వనరుల గణన జలాశయాలపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

మండలంలోని బావులు, చెరువులు, కుంటలతో పాటు అన్ని రకాల జల వనరులను రికార్డులలో నమోదు చేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళికా శాఖ కార్యాలయం ఉప గణాంక అధికారి డీఎస్‌ఎన్‌ రాజు గణన వివరాలను తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయా మండలాల సూపర్‌వైజర్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏలతో పాటు ఉపాధిహామీ క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...