మామిడిలో ‘ఇథలీన్‌'ను మాత్రమే వాడాలి


Fri,May 17, 2019 02:12 AM

-జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల
- అధికారి రాజ్‌కుమార్‌

మంచిర్యాల రూరల్‌ : మామిడి పండ్లను 75 శాతం పిండి పదార్థం కలిగిన ఎన్‌ రై పే ఇథలీన్‌ పొడిని మాత్రమే వినియోగించి సాధారణ రీతిలో మామిడి పండ్లను మాగబెట్టేందుకు ప్రభుత్వ అనుమతి ఉందని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి రాజ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విష పదార్థాలు కలిగి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం కార్బైడో వినియోగించరాదని హెచ్చరించారు. కాల్షియం కార్బైడోతో మాగపెట్టడంతో ఆ పండ్లు తిన్న వారికి అనారోగ్యం సమస్య తలెత్తుతుందనీ, వినియోగించిన వారిపై ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్‌రైపే ఇథలీన్‌ పొడిని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌, బెంగళూర్‌ వారిచే అనుమతించబడిన భారతీయ ఆహార భద్రత, నాణ్యత సంస్థలైసెన్స్‌ కలిగి ఉందని తెలిపారు. 20 కిలోల మామిడి పండ్ల ను మాగబెట్టేందుకు 5గ్రాముల ఎన్‌రైఫే పొడి సరిపోతుందనీ, ఈ ప్యాకెట్‌ ధర 25 రూపాయలు ఉంటుందన్నారు. ఈ ప్యాకెట్‌కు రెండు రంధ్రాలు చేసి 20 కిలోల బరువు కలిగిన మామిడి పండ్ల కాటన్లో ఉంచి మూసివేస్తే 3 నుంచి 4 రోజులలో మాగుతాయని తెలిపారు.

కర్ణపేటలో మామిడి రైతులకు అవగాహన
దండేపల్లి : మామిడికాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, వాటిని మగ్గబెట్టేందుకు హానికరమైన కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్‌రైప్‌ అనే పిండి పదార్థాన్నీ వాడాలని ఉద్యానవనశాఖ అధికారి సహజ అన్నారు. దండేపల్లి మండలంలోని కర్ణపేటలో మామిడి కాయలు మగ్గబెట్టే విధానంపై గురువారం అవగాహన కల్పించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...