‘సింగరేణి’ విద్యార్థులకు ప్రోత్సాహమందిస్తాం


Fri,May 17, 2019 02:11 AM

-జీఎం రాఘవులు
-ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి సన్మానం

మందమర్రి రూరల్‌ : సింగరేణి పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు యాజమాన్యం పోత్సహిస్తున్నదని మందమర్రి ఏరియా జీఎం రాఘవులు పేర్కొన్నారు. సింగరేణి పాఠశాలలో చదివి 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం జీఎం కార్యాలయంలో సన్మానించారు. శాలువాలు కప్పి వారిని అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ మొత్తం సింగరేణి స్థాయిలో ఎల్‌. పూజిత 9.2 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. అంతే కాకుండా ఎన్‌. విద్యారాణి 8.8, ఈ ప్రణయ, సాయి నితిన్‌ 8.7 జీపీఏ సాధించారని అభినందించారు. ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు 95 శాతం వచ్చాయని ఇది ఎంతో సంతోషకరమన్నారు.

విద్యార్థులు ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ భవిష్యత్‌లో ఉన్నత చదువుల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. గొప్ప చదువులు చదువుతున్న కార్మిక పిల్లలకు సింగరేణి ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. కార్మికుల పిల్లలు లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అభిరుచికి తగ్గట్టుగా కోర్సులు ఎన్నుకొని రాణించాలన్నారు. ఉత్తమ ఫలితాలకు కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్‌, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఎం మురళీధర్‌రావు, డీవై పీఎం, పాఠశాల కరస్పాండెంట్‌ ఎస్‌. శ్యామ్‌ సుందర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్‌, విద్యార్థుల తల్లిదండ్రులున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...