ఇదే స్ఫూర్తిని కొనసాగించండి


Fri,May 17, 2019 02:10 AM

-సింగరేణి ఈఅండ్‌ఎం డైరెక్టర్‌
- జైపూర్‌ ఎస్టీపీపీ సందర్శన
జైపూర్‌: ఎస్టీపీపీ గణనీయమైన ఉత్పత్తి సాధించడంలో అధికారులు, కార్మికుల పనితీరు అభినందనీయమనీ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సింగరేణి ఈఅండ్‌ఎం డైరెక్టర్‌ శంకర్‌ పేర్కొన్నారు. జైపూర్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. అధికారులతో కలిసి మొదటి యూనిట్‌, రెండో యూనిట్‌కు సంబంధించిన పని స్థలాలను సందర్శించారు. కంట్రోల్‌ రూంలో ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పని స్థలాల సందర్శన అనంతరం విద్యుత్‌ కేంద్రం అధికారులతో సమావేశంలో పలు సూచనలు చేశారు.

సమష్టి కృషితో విజయవంతంగా ఉత్పత్తి సాధిస్తున్న అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ కేంద్రం సాంకేతిక ఉన్నత సలహాదారు సంజయ్‌కుమార్‌ష్యూర్‌, జీఎం పిచ్చయ్యశాస్త్రి, జీఎం పర్చేస్‌ గణపతిరావు, చీఫ్‌ ఆప్‌ఓఅండ్‌ఎం జైన్‌సింగ్‌, ఎస్‌ఓటూ డైరెక్టర్‌ విశ్వనాథరాజు, డీజీఎంలు మదన్‌మోహన్‌, శ్రీనివాస్‌, ఈఈ ధనుంజయ్‌, పీఎం లక్ష్మణ్‌రావు తదితరులున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...