పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీ నివారణ


Fri,May 17, 2019 02:09 AM

-జిల్లా వైద్యాధికారి భీష్మ
-నస్పూర్‌ కార్మికవాడల్లో అవగాహన ర్యాలీ
-దోమల నివారణతోనే వ్యాధి నిర్మూలన
-ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ప్రజలకు పిలుపు

సీసీసీ నస్పూర్‌: పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీని నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి భీష్మ, జిల్లా ప్రోగ్రాం అధికారి రవి పేర్కొన్నా రు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కార్మిక వాడ ల్లో గురువారం అవగాహన ర్యాలీ తీశారు. న్యూ నాగార్జునకాలనీలో డీఎంఅండ్‌హెచ్‌ఓ భీష్మ ప్రారంభించగా న్యూ నాగార్జునకాలనీ, గోదావరికాలనీ(షిర్కె)లో ర్యాలీ సాగింది. అ నంతరం సేవా భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మూడేళ్ల నుంచి జిల్లా లో మలేరియా వ్యాధి తగ్గిందనీ, డెంగీ మాత్రం పెరుగుతూ వస్తుందన్నారు. డెంగీ వ్యాధికి ప్ర ధాన వాహకాలు దోమలేనన్నారు. దోమ కాటు తో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తుం దని చెప్పారు. వాహక దోమలు ఎక్కువగా వానాకాలంలో కనిపిస్తాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలనీ, పూలకుండీలు, ఏయిర్‌ కూలర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు, పాత టైర్లు, పాత ఖాళీ డబ్బాల్లో దోమలు ఉంటాయని వివరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉం డేలా చూసుకోవాలని కోరారు.

వ్యాధి సోకేం దుకు వయస్సుతో నిమిత్తం లేదన్నారు. దోమ లను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని పిలుపునిచ్చారు. వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓలు అనిత, విజయపూర్ణిమ, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ జ్ఞానసుందరి, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ నాం దేవ్‌, మలేరియా టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ సం తోష్‌, మెడికల్‌ అధికారి సంజయ్‌, హెల్త్‌ ఎడ్యూకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...