నిబంధనలు పాటించకుంటే చర్యలు


Fri,May 17, 2019 02:08 AM

-ట్రాఫిక్‌ సీఐ రమేశ్‌
-అధిక శబ్ధంతో తిరుగుతున్న వాహనాల పట్టివేత
-13 మంది యజమానులకు రూ. వెయ్యి చొప్పున జరిమానా

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: వాహన దారులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని మంచిర్యాల పట్టణ ట్రాఫిక్‌ సీఐ రమేశ్‌ బాబు హెచ్చరించారు. సిబ్బందితో కలిసి పట్టణంలో గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించా రు. అధిక శబ్ధం చేస్తూ తిరుగుతున్న 13 బైకులను పట్టుకుని స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిం చి, యజమానులకు జరిమానా విధించారు. ఆ యన మాట్లాడుతూ కంపెనీ అమర్చిన సైలెన్సర్ల స్థానంలో అధిక శబ్దం వచ్చేవి అమర్చి ధ్వని కాలుష్యానికి కారకులు కావద్దన్నారు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, యహహా కంపెనీలకు చెందిన బైక్‌లపై పలువురు యువకులు వాటితో వచ్చిన కంపెనీ సైలెన్సర్లను తొలగించి అధిక శబ్దం వచ్చే వాటిని బిగించారు. ఈ వాహనాల మూలంగా ఇతర వాహన దారులు, బాటసారులు ఆందోళనకు గురవుతు న్నారన్నారు.

దీంతో ప్రత్యేకంగా సైలెన్సర్లను అమర్చుకున్న వాహనాలను పట్టుకునేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా సైలెన్సర్లను అమర్చి, అధిక శబ్దం తో నడుస్తున్న వాటిని పట్టుకున్నారు. వీటిని పోలీ స్‌ స్టేషన్‌కు తరలించి, మెకానిక్‌లతో వాటిని తొలగించారు. పట్టుబడిన ప్రతీ వాహన దారుడికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు రమేష్‌ బాబు తెలిపారు. ఇకపై ఇలాంటి వా హనాలు కనబడితే జరిమానా తప్పదని హెచ్చరించారు. తనిఖీల్లో ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ అంజయ్య, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...