గోదావరి జలాలకు నాయక్‌పోడ్‌లు


Fri,May 17, 2019 02:06 AM

దండేపల్లి: చైత్రమాసాన్ని పురస్కరించుకొని ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం కైరీతీ గ్రామం భీమన్న దేవత -తరాల పోచమ్మతల్లి దేవతలను తీసుకొని నాయక్‌పోడ్‌ కులస్తులు పాదయాత్రగా గురువారం మండలానికి చేరుకున్నారు. నాయక్‌పోడ్‌ కులస్తులను స్థానికులు మాకులపేట వద్ద ఘనస్వాగతం పలికి డోలు వాయిద్యాలతో గోదావరి నది వరకు తీసుకెళ్లారు.

ఎడ్లబండ్లతో కుటుంబ సమేతంగా చేరుకున్న గిరిజనులు గోదావరి పవిత్ర జలాలను తీసుకొని, ఇక్కడే పుణ్య స్నానాలు చేసి తిరిగి ఆసిఫాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. 25తో ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో కులదేవతలకు ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. నాయక్‌పోడ్‌ కులపెద్దలు భీమయ్య, గంగయ్య, పోచయ్య, రమేష్‌, బాపురావు, చిన్నయ్య, ఎల్లయ్య, రాజేష్‌, మైసయ్య, సుమారు 16 గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు ఉన్నారు

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...