బావిలో పడి యువకుడి మృతి


Fri,May 17, 2019 02:05 AM

మంచిర్యాల రూరల్‌ : ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందినట్లు హాజీపూర్‌ ఎస్‌ఐ చందర్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్‌ మండలం దొనబండ గ్రామానికి చెందిన బోండ్ల సంపత్‌ (20)అనే మానసిక వికలాంగుడు బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని మామిడితోట వైపు మామిడి పండ్ల కోసం వెళ్లాడు. దాహం కావడంతో సమీపంలోని వ్యవసాయ బావిలోనికి నీరు తాగటానికి వెళ్లి కాలు జారిపడి పడ్డాడు. బయటకు రాలేక మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్ర య్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...