యువతి అపహరణకు యత్నం


Fri,May 17, 2019 02:05 AM

సీసీసీ నస్పూర్‌ : సీసీసీ నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతి (20)ని అపహరించేందుకు ఆటోడ్రైవర్‌ సురేశ్‌ యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లికి చెందిన ఓ యువతి గోదావరికాలనీ(షిర్కె)లో ఉండే తన సోదరి ఇంటికి వచ్చింది. రెండు రోజు ల పాటు ఇక్కడే ఉన్న ఆ యువతి గురువారం సాయంత్రం పెద్దపల్లికి వెళ్లేందుకు బయలుదేరింది. సీసీసీ కార్నర్‌ వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉండడంతో షిర్కెలో ఆటో ఎక్కింది. ఆటోడ్రైవర్‌ తెలంగాణ తల్లి విగ్ర హం నుంచి సీసీసీ కార్నర్‌కు వెళ్లాల్సి ఉండగా, మంచిర్యాల వైపు తిప్పాడు. దీంతో ఆందోళనకు గురైన యువతి ఆటోడ్రైవర్‌ను నిలదీసింది. వినకపోవడంతో భయందోళనతో 100కు కాల్‌ చేసింది. అంబేద్కర్‌కాలనీ సమీపంలోకి రాగానే ఆటోలో నుంచి దూకింది. దీంతో స్థానికులు ఆటోడ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అం దించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు లు వివరాలు తెలుసుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో నుంచి దూకడంతో యువతికి గాయాలు కాగా దవాఖానను తరలించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...