బెల్లంపల్లిలో సినీ ఫక్కీలో చోరీ


Fri,May 17, 2019 02:04 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : బెల్లంపల్లిలో ఇద్దరు యువకులు ఓ మహిళా వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసును సినీ ఫక్కీలో దొంగిలించారు. ఈ ఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది. బెల్లంపల్లి వన్‌టౌన్‌ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ కథనం ప్రకారం వివరాలు.. పట్టణంలోని పాతబస్టాండ్‌లో నివాసముంటున్న కటోరి కమల గురువారం బజార్‌ ఏరియాలో ఉన్న దుర్గామాత దేవాలయానికి వెళ్లి ఇంటికి డబ్బుసేట్‌ లైన్‌ నుంచి ప్రధాన రహదారికి నడుచుకుంటూ వెళ్తున్నది. ఓ యువకుడు వచ్చి మీకు ఆధ్యాత్మకతపై మక్కువ ఎక్కువ కదా తెలిసిన ఆధ్యాత్మిక గురువు ఉన్నాడని పూజలు చేయించుకుంటావా అని అడిగాడు. అందుకు ఆమె అంగీకరించడంతో ఆమెను డబ్బుసేట్‌లైన్‌ నుంచి ఓ గల్లీకి తీసుకొచ్చాడు. అక్కడ మరో వ్యక్తి ఉన్నాడు. ఇక్కడికే గురువు వస్తాడని నమ్మించాడు. గురువు పూజచేసేటప్పుడు ఒంటిమీద ఎలాంటి అభరణాలు ఉంచవద్దని చెప్పారు.

అంతకు ముందే సదరు వ్యక్తులు ఆమెకు మామిడికాయలు ఉన్న సంచిని ఇచ్చారు. వారు చెప్పిన మాదిరిగా కమల ఒంటిమీద ఉన్న రెండు తులాల బంగారు గొలుసును తీసి సంచిలో పెట్టుకున్నది. ఇద్దరిలో ఒకడు ఆమెను ఆధ్యాత్మక మాటలతో దృష్టి మళ్లించగా మరొకడు సంచిలో ఉన్న బంగారు గొలుసును తస్కరించాడు. కొద్దిసేపటికి గొలుసు దొంగలించిన యువకుడు గురువురు తీసుకొస్తానని నమ్మించి అక్కడి నుంచి వెళ్ల్లిపోయాడు. కొద్దిసేపటికీ రెండో వ్యక్తి ఆధ్యాత్మక గురువును తీసుకొస్తానని నమ్మించి అక్కడి నుంచి ఉడాయించాడు. యువకులు తిరిగిరాకపోవడంతో ఆ మహిళ సంచిలో బంగారు ఆభరణాన్ని మెడలో వేసుకుందామనీ సంచి చూసే సరికి మామిడికాయలు ఉన్నాయి. దీంతో ఆమె బెల్లంపల్లి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు రూ. లక్ష వరకు ఉంటుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...