అంతర్‌ రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్ట్‌


Fri,May 17, 2019 02:03 AM

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ : ఐదేళ్లుగా తెలుగు రాష్ర్టాల్లోని మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, కడ ప, కరీంనగర్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, నంద్యా ల పట్టణాల్లో షాపుల యజమానుల దృష్టి మళ్లించి దోపిడీలకు పాల్పడుతున్న పాత నేరస్తులు షావలి, విజయ్‌కుమార్‌ అనే ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలను అరెస్ట్‌ చేసినట్లు మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ నెల 10వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివా స టాకీసు రోడ్డులోని హనుమాన్‌ ట్రేడర్స్‌లో సామగ్రి కొంటున్నట్లు నటించి యజమాని విశ్వనాథ్‌ను ఒకరు మాట ల్లో పెట్టారు.

దృష్టి మళ్లించి మరొకరు కౌంటర్‌లో నుంచి రూ. 20వేల నగదు ఎత్తుకెళ్లాడు. వీరు సీసీఎస్‌ ఎస్‌ఐ జానీ పా షా, సిబ్బంది సతీశ్‌, శ్రీనివాస్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించా రు. వీరిద్దరు నంద్యాల పట్టణంలో నివాసముంటూ కూరగాయల వ్యాపా రం చేసుకుంటారు. వివరాలు సేకరించగా ఈ నెల పదో తేదీన హనుమాన్‌ ట్రేడర్స్‌లో దోపిడీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. వీరి నుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ షావలి, విజయ్‌కుమార్‌పై తెలుగు రాష్ర్టాల్లో పలు కేసులు ఉన్నాయనీ, ముఖ్యంగా వీరు దుకాణాల యజమానుల దృష్టి మరల్చి దోపిడీలు చేస్తారనీ, వ్యాపారులు, ప్రజ లు ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వీరిని రిమాండ్‌కు పంపిస్తామని సీఐ వివరిం

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...