రంజాన్‌ దుస్తులు, గిఫ్ట్‌ ప్యాకెట్ల పంపిణీ జాబితా సిద్ధం చేయాలి


Fri,May 17, 2019 01:57 AM

జాయింట్‌ కలెక్టర్‌ డేవిడ్‌ మహబూబాబాద్‌ నమస్తే తెలంగాణ, మే 16 : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన ముస్లింలకు ఇఫ్తార్‌ విందు, గిఫ్ట్‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నద ని జాయింట్‌ కలెక్టర్‌ మాలవత్‌ డేవిడ్‌ అన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరెట్‌ సమావేశ మందిరంలో ముస్లింలకు కానుకగా ఇస్తున్న గిఫ్ట్‌ ప్యాకెట్ల పంపిణీ, ఇఫ్తార్‌ విందుపై జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో మతపెద్దలు, మసీద్‌ కమి టీ సభ్యులు, తహసీల్దార్‌లతో జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మా ట్లాడూతూ ఇఫ్తార్‌ విందు నిర్వహించేందుకు ప్ర భుత్వం జిల్లాకు రూ.5 లక్షల నిధులు 25 వేల గిఫ్ట్‌ ప్యాకెట్లు విడుదల చేసిందన్నారు.

వీటిని మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గం లోని ముస్లింలకు అందించనున్నట్లు చె ప్పారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా పార్టీలకతీతంగా స్నేహ పూర్వకంగా రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకోవాలని అన్నారు. గిఫ్ట్‌ ప్యాకెట్ల ఎంపికలో ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు మాత్రమే నమోదు చేయాలని సూచించారు. లబ్ధిదారులను ప్రణాళికతో ఎంపిక చేసి ఈ నెల 25లోపు జాబి తా సిద్ధం చేసి సమర్పించాలని అన్నారు. జాబి తా పం పించాల్సిన బాధ్యత మసీద్‌ కమిటీ, తహసీల్దా ర్లు తీసుకోవాలన్నారు. ఈ నెల 19 నుంచి 25 వ తేదీ లోపు గిఫ్ట్‌ ప్యాకెట్లు జిల్లాకు రానున్నట్లు జేసీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, ఆర్డీవోలు కొమురయ్య, ఈశ్వరయ్య, ముస్లిం మత పెద్ద లు, మసీద్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...