వరికోల్‌ శ్రీనివాస్‌రెడ్డిదే గెలుపు


Fri,May 17, 2019 01:55 AM

-డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌
-టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలను కలిసిన ఎమ్మెల్యే
మరిపెడ, నమస్తేతెలంగాణ : వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వరికోల్‌ శ్రీనివాస్‌రెడ్డిదే గెలుపు అని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌ అన్నారు. హైదరాబాద్‌ క్యాంపునకు తరలి వెళ్లిన డోర్నకల్‌ నియోజక వర్గంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలను రెడ్యానాయక్‌ వారిని కలిసి మాట్లాడా రు. వరికోల్‌ (పోచంపల్లి) శ్రీనివాస్‌రెడ్డి సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌కు ఎంతో దగ్గరి వ్యక్తి అని, పార్టీ కోసం కష్టపడిన వారని గుర్తు చేశారు. డోర్నకల్‌ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు శ్రీనివాస్‌రెడ్డికే ఓటేస్తారన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నిక, ఓటింగ్‌ విధానంపై ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అవగాహన కలిపించారు. రెడ్యానాయక్‌ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌, మానుకోట ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆర్‌ సత్యనారాయణరెడ్డి, ముండ్ల రమేశ్‌, టేకుల యాదగిరిరెడ్డి, నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీలు బాల్ని మాణిక్యం, ధర్మారపు వేణు, కొణతం కవిత, కేశబోయిన స్వరూప, ఎంపీపీలు తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్‌, సంపెట సుజాత, బజ్జూరి ఉమ, మేకపోతుల రమ్యశ్రీనివాస్‌, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ ఎండీ అయూబ్‌ తదితరులు ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...