10 పోలింగ్‌ కేంద్రాలు 902 మంది ఓటర్లు


Fri,May 17, 2019 01:55 AM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : ఈనెల 31న జరిగే వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలు, ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉండే ఓటర్లు ఎంతమంది? వంటి అంశాలపై ఎన్నికల సంఘానికి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నివేదించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్‌ కేంద్రాలకు ప్రతిపాదనలు చేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సహా ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఓటర్లు, వారు ప్రాతినిథ్యం వహించే ప్రాంతం, ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉండే పరిధి మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 902 మంది ఓటర్లను ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలు, ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే సంఖ్యపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఉండే ఓటర్ల సంఖ్య (బ్రాకెట్‌లో) ఈ విధంగా ఉంది.
పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలు ..
పోలింగ్‌ కేంద్రం: జిల్లాప్రజాపరిషత్‌ వరంగల్‌ (146 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్లు)
అర్బన్‌, రూరల్‌ జిల్లాలు : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్‌, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం
పోలింగ్‌ కేంద్రం: జీడబ్ల్ల్యూఎంసీ కమిషనర్‌ ఆఫీస్‌, వరంగల్‌(64) కార్పొరేటర్లు
పోలింగ్‌ కేంద్రం: ఎంపీడీవో కార్యాలయం, నర్సంపేట (89)
నర్సంపేట మున్సిపల్‌ కౌన్సిలర్స్‌, చెన్నారావుపేట, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట, ఖానాపూర్‌, దుగ్గొండి మండల ఎంపీటీసీలు
పోలింగ్‌ కేంద్రం: ఎంపీడీవో కార్యాలయం, పరకాల (63)పరకాల మున్సిపల్‌ కౌన్సిలర్స్‌, ఆత్మకూర్‌, పరకాల, శాయంపేట మండలాల ఎంపీటీసీలు
పోలింగ్‌ కేంద్రం: ఎంపీడీవో కార్యాలయం, జనగాం (131)
జనగామ మున్సిపల్‌ కౌన్సిలర్లు, జనగాం, లింగాల ఘనపురం, బచ్చన్నపేట, దేవురుప్పుల, నర్మెట, రఘునాథపల్లి, మద్దూర్‌, చేర్యాల మండలాల ఎంపీటీసీలు
పోలింగ్‌ కేంద్రం: ఎంపీడీవో కార్యాలయం, ఘన్‌పూర్‌(స్టే) (65)
ఘన్‌పూర్‌ (స్టే), జఫర్‌గడ్‌, పాలకుర్తి, కొడకండ్ల ఎంపీటీసీలు
పోలింగ్‌ కేంద్రం: ఎంపీడీవో కార్యాలయం, మానుకోట (124)
మహబూబాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు, మహబూబాబాద్‌, కురవి, కేసముద్రం, డోర్నకల్‌, గూడూరు, కొత్తగూడ ఎంపీటీసీలుపోలింగ్‌ కేంద్రం: ఎంపీడీవో కార్యాలయం, తొర్రూరు (80)
తొర్రూరు, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట ఎంపీటీసీలు
పోలింగ్‌ కేంద్రం: జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలికలు) స్కూల్‌ కాంప్లెక్స్‌,
ములుగు (57)ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక్క, సారలమ్మ) ఏటూరునాగారం మండలాల ఎంపీటీసీలుపోలింగ్‌ కేంద్రం: భూపాలపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం, రూమ్‌ నంబర్‌12, రెవెన్యూ సెక్షన్‌, భూపాలపల్లి (83)
భూపాలపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు, భూపాలపల్లి, గణపురం (ము), రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల ఎంపీటీసీలు

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...