ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయిస్తాం


Thu,May 16, 2019 02:02 AM

-ఎమ్మెల్యే దివాకర్‌ రావు
లక్షెట్టిపేట : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీల విజ్ఞప్తి మేరకు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పే ర్కొన్నారు. బుధవారం పట్టణ మున్సిపల్‌ కార్యాలయంలో తాగునీటి సరఫరాపై స్థాని క నాయకులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ పరిధిలోని మస్తాన్‌ గూడ, మోదెలతోపా టు పలు చోట్ల తాగునీరు ప్రతి రోజు ప్రజలకు అందడం లేదన్న ఫిర్యాదులపై వెంట నే మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రంజాన్‌ ఉపవాస దినా ల్లో ముస్లిం వార్డులకు ఖచ్చితంగా తాగునీరందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నా రు.

రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు ప్రభుత్వ దవాఖానలో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే విధంగా రూ.22 కోట్లతో నిర్మించనున్న నూతన దవాఖాన భవన నిర్మాణ విషయ మై స్థ్ధానిక నాయకులు, వైద్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్ల చంద్రయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగు, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ కేతిరెడ్డి శ్రీనివా స్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ పాదం శ్రీనివాస్‌, పార్టీ మండలాధ్యక్షుడు పోడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు మెట్టు రాజు, శాంతి కుమార్‌, కాంతయ్య, వైద్యులు కుమారస్వామి, మున్సిపల్‌ మేనేజర్‌ అనిల్‌ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...