సేవా కార్యక్రమాలు విస్తృత పరుస్తాం


Thu,May 16, 2019 02:00 AM

-జీఎం లక్ష్మీనారాయణ
-నస్పూర్‌కాలనీల సేవా కార్యకర్తలతో సమావేశం
సీసీసీ నస్పూర్‌ : శ్రీరాంపూర్‌ ఏరియా లో సేవా కార్యక్రమాలు మరింతగా విస్తృత పరుస్తామని జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, సేవా అధ్యక్షురాలు సరళాదేవి పేర్కొన్నారు. బుధవారం వారు నస్పూర్‌కాలనీ సేవా భవన్‌ను సందర్శించారు. అనంతరం సేవా కార్యకర్తలతో సమావేశమయ్యారు. సేవా కార్యకర్తలను పరిచయం చేసుకున్న సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు తమ ఉద్యోగాలను సక్రమంగా నిర్వర్తించడానికి పరోక్షంగా మహిళలే కారణమనీ, మహిళల తోడ్పాటు లేకుండా సిం గరేణి అభివృద్ధి కొంత కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. శ్రీరాంపూర్‌ ఏరియా సింగరేణిలో అతిపెద్ద ఏరియా అనీ, ఈ ప్రాం తంలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో సేవా సమితి ద్వారా కొత్త కొత్త వృత్తి శిక్షణ కోర్సులు ప్రవేశపెడుతామని తెలిపారు. సేవా సమితికి తమవంతు సహకారం ఉం టుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సేవా కార్యకర్తలు జీఎం దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్‌ గోవిందరాజు, పర్సనల్‌ మేనేజర్‌ అజ్మీరా తుకారాం, పీఆర్‌ఏ సంపత్‌కుమార్‌, సేవా కార్యకర్తలు కొట్టె జ్యోతి, రత్నకళ, మంజుల, సునీత, తిరుమల, లలిత, శంకరమ్మ, రజిత, లక్ష్మి పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...