100శాతం ఉత్పత్తి ఘనత సత్యనారాయణదే


Thu,May 16, 2019 01:58 AM

- డీవైజీఎం శ్రీనివాస్‌
- పదోన్నతితో బదిలీ అయిన డీవైజీఎంకు నాయకులు, కార్మికుల సన్మానం
శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్‌కే 6గనిలో 6 సంవ త్సరాల పాటు 100 శాతం ఉత్పత్తి సాధించడంలో గని మేనేజర్‌ సత్యనారాయణ ఘనత ఉందని ఏజెంటు డీవైజీఎం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం గనిపై మేనేజర్‌గా పని చేసి డీవైజీ ఎంగా పదోన్నతితో ఇందారం ఓసీపీకి బదిలీపై వెళ్తున్న సత్యనా రాయణను గని అధికారులు, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురెందర్‌రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి పానగంటి సత్తయ్య శాలువాలతో ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా ఏజెంట్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతు గనికి మంచి గుర్తింపు తెచారని చెప్పారు.

రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తికి కృషి చేశారని చెప్పారు. సురెందర్‌రెడ్డి మాట్లాడు తూ మేనేజర్‌ సత్యనారాయణ కార్మికులు, అధికారులతో మంచి సంబంధాలు నెరిపారని చెపారు. బదిలీ అవుతున్న డీవైజీఎం సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులు తన విధి నిర్వహణ లోసహకరించారనీ, సమష్ఠి కృషితోనే గని లక్ష్యాలు సాధించామ న్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మేనేజర్‌ సంతోశ్‌కుమా ర్‌కు కార్మికుల సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గని డిప్యూటీ మేనేజర్‌ రాంచందర్‌, శ్రీనివాస్‌, కాదాసి శ్రీనివాస్‌, సీనియర్‌ పీఓ శ్యాంప్రసాద్‌, టీబీజీకేఎస్‌ ఏరియా చర్చల ప్రతి నిధులు కాశీరావు, కుమారస్వామి, పోశెట్టి, పిట్‌ కార్యదర్శి చిలు ముల రాయమల్లు, నాయకులు తోట రాములు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...