అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు


Thu,May 16, 2019 01:57 AM

సీసీసీ నస్పూర్‌ : సీసీసీ ఆర్‌కే-5కాలనీ బ్యారెక్స్‌లోని శ్రీసాయి వృద్ధాశ్రమంలో ఉంటున్న కౌటారపు ఈశ్వరమ్మ(86) అనారోగ్యంతో మృతి చెందింది. కోటపల్లి మండలంలోని పారుపెల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ భర్త గతంలో చనిపోయాడు. వీరికి పిల్లలు లేరు. ఒంటరిగా ఉంటూ ఎలాంటి జీవనాధారం లేకపోవడంతో గ్రామస్తులు 2013లో శ్రీసాయి అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఈశ్వరమ్మ కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతుంది. ఆశ్రమంలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం చనిపోయింది. ఈశ్వరమ్మ పార్థివ దేహానికి ఆశ్రమ నిర్వాహకులు అంత్యక్రియలు చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు సుద్దాల ప్రసాద్‌, కోశాధికారి మూర్తి, సలహాదారుడు లక్కర్సు ఆగయ్య, సభ్యులు భానుప్రకాశ్‌ పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...