ఇనుప కూలర్‌ షాక్‌


Thu,May 16, 2019 01:56 AM

-హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి
నెన్నెల(కన్నెపల్లి) : కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు(58) ఐరన్‌ కూలర్‌లో నీళ్లు పోస్తూ ప్రమాదవశాత్తూ కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. మంగళవారం రాత్రి రాజు ఇంట్లో ఉన్న కూలర్‌లో నీళ్లు పోస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. రోజూ ఇంటి పక్కన ఉన్న హోటల్‌కు భోజనం కోసం వచ్చే రాజు రాత్రి పది గంటలు దాటినా రాకపోవడంతో హోటల్‌ యజమాని రాజు గదికి వెళ్లి చూడగా కూలర్‌ పక్కనే విగతజీవిగా పడి ఉన్నాడు.

వెంటనే ఎస్‌ఐ రాజ్‌కుమార్‌కు సమాచారం అందివ్వగా తాండూర్‌ సీఐ ఉపేందర్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుధవారం హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు గోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద రూ.25వేలు కటుంబసభ్యులకు అందించారు. హెడ్‌ కానిస్టేబుల్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...