‘సైనిక్‌ స్కూల్‌'కు సంక్షేమ విద్యార్థుల ఎంపిక


Thu,May 16, 2019 01:52 AM

బెల్లంపల్లిరూరల్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లాలోని రుక్మాపూర్‌ సైనిక్‌ కళాశాలలో ప్రవేశాలకు బెల్లంపల్లి తెలంగాణ సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ( సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ) నుంచి ఐదురుగు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు తెలిపారు.

సైనిక్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో బెల్లంపల్లి బాలుర కళాశాలలో ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ చూపిన జీ అజిత్‌ కుమార్‌, కే సాయికిరణ్‌, ఆర్‌ అహింప్రసాద్‌, ఆర్‌ మాధవన్‌, టీ ప్రదీప్‌ ఎంపికైనట్లు వివరించారు. ఎంపికైన వీరు రుక్మాపూర్‌లో జరిగే ప్రత్యేక వైద్య పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం సైనిక్‌ స్కూల్‌లో అడ్మిషన్లు పొందనున్నారని వివరించారు. సైనిక్‌ స్కూల్‌కు కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులను ఆర్సీవో ఆర్‌.అనంతలక్ష్మి, ఏఆర్సీవో ఆనందరెడ్డి లతో పాటు పేరెంట్స్‌ కమిటీ సభ్యులు బుధవారం అభినందించారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...