వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం


Thu,May 16, 2019 01:52 AM

-పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
-125 మంది దంపతులతో ప్రత్యేక పూజలు
మందమర్రి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి వేద పండితులు స్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు అనంతాచార్యు లు, నర్సింహాచార్యులు, శ్రీకాంతాచారి, అజయ్‌కుమార్‌, కృష్ణకాంతాచార్యులు, శ్రీకరాచార్యులు, శ్రీధరాచార్యులు, శ్రీరామ్‌, వంశీ, హరి మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా స్వామి వారి కల్యాణ వేడుకలను నిర్వహించారు. 125 మంది దంపతులు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. వందలాది సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించి దేవతామూర్తులను దర్శించుకున్నారు. వేడుకల్లో సింగరేణి మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ రాఘవులు దంపతులు, డీవైజీఎం(సివిల్‌) గోవిందప్ప, ఐటీ ఎస్‌ఓడీ రవి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు వలంటీర్లు సేవలందించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...