ఆన్‌లైన్ చేయరు..రిజిస్ట్రేషన్ కాదు!


Fri,April 26, 2019 12:57 AM

- పేరు ఎక్కియ్యడానికి ఎన్ని రోజులు కావాలె?
- రైతుబంధు సాయం నష్టపోయాం
- రెండేండ్ల నుంచి అరిగోస పడుతున్నం
- ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలె
- పున్నపురెడ్డి రమేశ్ ఆవేదన

తాండూర్ : ఈ చిత్రంలో ఉన్నది పున్నపురెడ్డి రమేశ్. ఈయన తండ్రి ఒకరి భూమిని కొన్నాడు. అయితే అతడి పేరు పహాణీల్లో ఉంది.. కానీ ఆన్‌లైన్‌లో లేదు. ఆన్‌లైన్‌లో ఎక్కిస్తేనే రిజిస్ర్టేషన్ చేస్తామని అధికారులు చెబుతుండడంతో రెండేండ్ల నుంచి ఆన్‌లైన్ కోసం తిరుగుతున్నారు. ఇంత చిన్న సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని రోజులు చేస్తారని రమేశ్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అతడు నమస్తే ధర్మగంటను గురించి తెలుసుకొని తాండూర్ విలేకరికి తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తాండూర్ గ్రామానికి చెందిన ఇందారపు కిషన్‌రావుకు సర్వే నెంబర్ 31లో 1.08 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని మా నాన్న పున్నరెండ్డి పోశం 2008లో కొనుగోలు చేశారు. అప్పుడు భూమిని కొన్నట్లు బాండ్‌పేపర్ మీద సాదాబైనమా రాయించుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు భూమి పట్టా చేయించుకోకుండానే మా నాన్న చనిపోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా నేను ఆ భూమిని మొదట మా తండ్రి పేరు మీద పట్టా చేయించుకునేందుకు ప్రయత్నం చేశాను. అయితే ఆన్‌లైన్‌లో మాకు భూమి అమ్మిన కిషన్‌రావు పేరు లేదట.

దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆన్‌లైన్ చేయించుకొని రండి అని తిప్పి పంపారు. రెండు సంవత్సరాలుగా ఆన్‌లైన్ విషయమై తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. వారానికి ఒకసారి అయినా పనులన్నీ ఒదులుకొని కార్యాలయానికి వచ్చి వెళ్తున్నా. మాకు అమ్మిన వ్యక్తి పేరు ఆన్‌లైన్ చేయాలని తాండూర్ వీఆర్వో, ఆర్‌ఐ, తాసిల్దార్‌ను కలిసినా పట్టించుకోవడం లేదు. కొన్నిరోజులు రికార్డులు వెతకాలి అన్నారు. మరికొన్ని రోజులు ఆన్‌లైన్ పని చేస్తలేదని, కొన్ని రోజులు ఎన్నికల కోడ్ అని రెండు సంవత్సరాలుగా తిప్పించుకుంటున్నారు. పహణీల్లో మాకు అమ్మిన వ్యక్తి పేరే ఉంది. వేరే వాళ్లకు ఆ భూమికి ఎవరికీ సంబంధమూ లేదు. అయినా రెవెన్యూ అధికారులు పని చేయకుండా తిప్పించుకుంటున్నారు. మా నాన్న పేరుమీదకి ఎప్పుడు మారుస్తారు? ఆ తర్వాత మళ్లీ నేను విరాసత్ చేయించుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలియడం లేదు. రెండు సార్లు రైతుబంధు డబ్బులు రూ.8వేలు నష్టపోయా. ఉన్నతాధికారులైనా పట్టించుకొని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నా.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...