అర్హులకు పథకాలు అందేలా కృషి చేయాలి


Fri,April 26, 2019 12:56 AM

మంచిర్యాల రూరల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అన్ని సంక్షే మ శాఖల సమన్వయంతో అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖ అధికారి శేషాద్రి, కిసా న్ మిత్ర, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ కార్పొరేషన్, ఉద్యావన వన, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమార్థం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందనీ,వీటిని మారుమూల గ్రామా ల ప్రజలకు సైతం అందేలా అధికారులు చూడాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబాలకు ఉపాధి కల్పనలో భాగంగా సహా య, సహకారాలను అందిస్తామని చెప్పారు. వారి పిల్లలకు రెసిడెన్సీ పాఠశాలల్లో ఉన్నత విద్యా వర కు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం..
రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిం చి సేంద్రియ ఎరువులను వినియోగిస్తు శాస్త్రీయ పద్దతితో పాటు అంతర్ పంటల వ్యవసాయం చేయాలని కలెక్టర్ సూచించారు. కిసాన్ మిత్ర బృంద సభ్యులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులను చైతన్య పర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలి రాజు, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్యామలాదేవి, జిల్లా పరిశ్రమల అధికారి సమ్మయ్య, డీపీఎం రవిందర్, కిసాన్ మిత్ర బృంద క్షేత్ర స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...