పరిషత్ ఎన్నికలు సక్రమంగా జరగాలి


Fri,April 26, 2019 12:56 AM

మంచిర్యాల రూరల్ : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సక్రమంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల నోడల్ పరిశీలకులు అబ్దుల్ హజీం అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి, డీసీపీ రక్షిత కే.మూర్తితో కలిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయనీ, ఈమేరకు విధులు కేటాయించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కోసం అవసరమైన నెట్‌వర్క్ ఏర్పాట్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో పోలింగ్ అధికారులు వైర్‌లెస్ సెట్స్‌ను వినియోగించేలా అవసరమైన సామగ్రిని సమకూర్చాలన్నారు.

అలాగే సూక్ష్మ పరిశీలకులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు పరస్పర అవగాహనతో విధులను నిర్వహించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి తరలించేందుకు వాహనాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోలీస్ శాఖ సహకారంతో పటిష్ట భద్రత ఏర్పాట్లను చేయ్యాలన్నారు. పోలింగ్ రోజున కేంద్రాల పరిధిలో 200 మీటర్ల వరకు ఎలాంటి ప్రచారం చేయకుండా ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలుఅయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు గౌస్‌బాబా, బాలుజాదవ్, వెంకట్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలి రాజు, బీడీఎం సునీల్, తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...