పరిషత్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి


Fri,April 26, 2019 12:56 AM

లక్షెట్టిపేట : వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసే లక్ష్యంతో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనిమిది ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకునేలా కృషిచేయాలని కోరారు. మండలంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. అలాగే మున్ముందు ఆయా గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ చిన్నయ్య, నాయకులు కాండ్రపు శంకరయ్య, కిషన్‌లతో పాటు సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...