జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి


Thu,April 25, 2019 02:52 AM

- మాజీ ఎమ్మెల్యే ఓదెలు సేవలకు గుర్తింపు
- టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన నేతలు
- సుమన్ చొరవతోనే అభ్యర్థి ప్రకటన
- కోటపల్లి జడ్పీటీసీ బరిలో భాగ్యలక్ష్మి

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అభ్యర్థిగా నల్లాల ఓదెలు భార్య నల్లాల భాగ్యలక్ష్మి పేరు ఖరారైంది. నల్లాల ఓదెలు సేవను గుర్తించి ఆయన భార్యను చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధిష్టానం చె న్నూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో బాల్క సుమన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ సమయంలో ఓదెలుకు అధిష్టానం నుంచి పూర్తిస్థాయిలో హామీ లభించింది. ఎట్టి పరిస్థితుల్లో నీకు అన్యాయం జరగదని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో నల్లాల ఓదెలు పార్టీకి కట్టుబడి పనిచేశారు. పార్టీకి చేసిన సేవలు, నియోజకవర్గ అభివృద్ధిపై చేసిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్ఛితంగా పదవి ఇవ్వాలని నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో ఇద్దరు ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి. జైపూర్, కోటపల్లిలో స్థానికంగా ఉన్న వారి పేర్లు పరిశీలనలోకి వచ్చినా వారు జిల్లాస్థాయి నేతలు కాకపోవడంతో అధిష్టానం వారిని పరిగణలోకి తీసుకోలేదు. నల్లాల ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది.

గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమె పేరును అధిష్టానం ఫైనల్ చేసింది. భాగ్యలక్ష్మి కోటపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఆ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అక్కడి నుంచి గెలిచి జడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. కాగా, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతోనే అభ్యర్థి ప్రకటన వెలువడింది. మొదటి నుంచి తన నియోజకవర్గం నుంచి జడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని సుమన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కోటపల్లి నుంచి నల్లాల ఓదెలు సతీమణిని బరిలోకి దించి ఆమెను జడ్పీ అధ్యక్షురాలిని చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సుమన్ సమక్షంలో పలువురు నేతలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి చర్చించారు. దీంతో అధిష్టానం ఆమె పేరుకు ఓకే చెప్పింది.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...