ముగిసిన నామినేషన్ల స్వీకరణ


Wed,April 24, 2019 11:55 PM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:మొదటి విడత పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తైంది. సోమవారం ప్రారంభమైన ఈ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. సోమ, మంగళ వారాలలో మామూలుగా నమోదైన నామినేషన్లు బుధవారం భారీగా దాఖలయ్యాయి. అభ్యర్థులు ఆయా పార్టీల బీ ఫారాలతో పాటు స్వతంత్రులు సైతం పెద్ద మొత్తంలో దాఖలు చేశారు. ఏడు మండలాల్లో జడ్పీటీసీ స్థానాల కోసం 84 నామినేషన్లు దాఖలయ్యాయి. తాండూరు మండలంలో అత్యధికంగా 22 నామినేషన్లు దాఖలు కాగా వేమనపల్లిలో అత్యల్పంగా ఐదు వచ్చాయి. 47 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 375 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బెల్లంపల్లి మండలంలో అత్యధికంగా 81 దాఖలు కాగా భీమిని మండలంలో అత్యల్పంగా 28 దాఖలు కావడం గమనార్హం. నామినేషన్ల ఉప సంహరణ గడువు 28వ తేదీ ఉండగా మే 6న పోలింగ్ నిర్వహించనున్నారు. 25న పరిశీలిన, 26న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న అభ్యంతరాలపై విచారణ చేపడుతారు. 28న ఉప సంహరణకు గడువు, ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...