రోషక్కకు పట్టా వచ్చింది..


Wed,April 24, 2019 11:55 PM

కోటపల్లి : ఆలుగామకు చెందిన దుర్గం రోషక్క సమస్య తీరింది. తాను పడుతున్న కష్టాలపై నమస్తే తెలంగాణ ధర్మగంటలో ఎవరికి చెప్పుకోవాలె? శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈమేరకు ఆమె ను కోటపల్లి తాసిల్దార్ రాజ్‌మోహన్ పిలిపించి, విరాసత్ కాకపోవడానికి గల కారణాలు తెలుసుకున్నా రు. ఆ తర్వాత సర్వే నంబర్ 106లోని 1.20 ఎకరాల భూమిని రోశక్క పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టా మార్పిడి ఉత్తర్వుల కాపీని ఆమెకు అందచేశారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన దుర్గం రోషక్కకు పట్టా వచ్చింది. రోషక్క భర్త గట్డయ్య చనిపోగా ఆ భూమిని తన పేరు మీద విరాసత్ చేయాలని కోటపల్లి తాసిల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకుంది. అయితే పట్టా చేసి ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చే యడంతో ఆఫీస్ చుట్టూ తిరిగీతిరిగి వేసారిం ది. మంగళవారం కూడా ఇదే పనిమీద రోష క్క తాసిల్దార్ కార్యాలయానికి రా గా ఆ రైతు బాధను నమస్తే తెలంగాణ విలేకరి తెలుసుకోగా ధర్మగంటలో ప్రచురితమైంది. ఈ కథనం తో వెంటనే స్పందించిన తాసిల్దార్ రాజ్‌మోహన్ రోషక్కను కార్యాలయానికి పిలిపించారు. విరాసత్ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకొని సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. ఆలుగామ శివారులో ఉన్న సర్వే నంబర్ 106లోని 1.20 ఎకరాల భూమిని రోశక్క పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టా మార్పిడి ఉత్తర్వుల కాపీని ఆమెకు అందచేశారు. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ కమల్‌సింగ్, ఆర్‌ఐ డిలేశ్ ఉన్నారు.

నమస్తేకు రుణపడి ఉంటా : రోషక్క
నా సమస్యకు పరిష్కారం చూపించిన నమ స్తే తెలంగాణకు రుణపడి ఉంటా. ఇన్నాళ్లు తాసిల్ ఆఫీస్ చుట్టూ ఎంత తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ధర్మగంట ద్వారా నా సమస్యను తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...